R1

నేనేమన్న కలగన్నాన
నీవు అటు వైపు వస్తావని
అనుకోకుండ చూశా
నీ నల్లని ముంగురులు
గాలికి రెపరెప లాడుతుంటే
నా గుండెలో ఏమిటా అలజడి
నీలాల సంద్రలా ఉన్నా
నీ కనులును చూడగానే
ఒక్క క్షణం నేను పడవలా మారి
నీ కనులలోకి జర్రున జారి పోయా
నీ పాదం పడగానే
ఒళ్ళు జల్లుమంది
నా గుండెకు అయిన గాయాన్ని
ముద్దాడటానికి వస్తున్నావనుకున్న
అంతలోనే ఎదో సంఘటన గుర్తుకి వచ్చినట్టు
ప్రక్కకు వెళ్ళి పోయావు
ఆ సమయంలో
నేను ఎంత భావోద్వేగంకు గురి అయ్యాను?
ఎందుకు నాపై కోపం, ఆగ్రహం
అది తలుచుకుంటూనే
నేను విచారం లోకి వెళ్ళి
ఆత్మ పరిశీలన చేసుకున్న
అప్పుడే తెలిసింది
గత సంఘటనను
మరిచిపోలేక పోతున్నావు అని
ఎప్పటి కప్పుడు పరిస్థితులను తెలుసుకుంటూ నష్టాన్ని అంచనా వేస్తూన్నావని
అది నాకు కూడ అందమైన పాఠమే
మీనుండి పారిపోవాలని
చాల సార్లు ప్రయత్నించా
ప్రయత్నించిన ప్రతి సారి
నీవు ఆ ప్రయత్నాని ఎదుర్కొన్నావు
చందమామ కథలలోని భేథాలుడిని
భుజం మీద వేసుకున్నట్టు నన్నేసుకున్నావు
పోలీస్ దొంగను పట్టుకున్నట్టు పట్టుకున్నవు
ఒక్కోసారి టామ్ అండ్ జర్రిలా ఉన్నాం
అంతకు మించిన మరి ఎదో బంధం నన్ను ఆపింది ఆసమయంలో నీవు నిరాశ కంటే బలంగా ఉంటావు ఒంటరితనం కంటే ధైర్యంగా ఉంటావు
ఎప్పటికి అలిసి పోని ఒక అన్వేషిలా ఉంటావు
ఆ చేదును తొందరగా వదిలేసి
ప్రశాంతమైన స్థలానికి చేరుకో
మన మధ్య అపరాధ గోడను నిర్మించింది ఎవరు?
మీ హృదయానికి అయిన గాయాన్ని
నేను ముద్దాడుతున్నాను
తద్వారా పునరుద్ధరణ ప్రక్రియ వేగంగా జరిగి మనమధ్య గొడను పగులగొట్టి
నీ హృదయాన్ని తెరచి కాంతిని ప్రసరింప చేసి ప్రశాంతమైన,
ఆహ్లదకరమైన జీవితాన్ని
సొంతం చేసుకోటానికి
చేసే ప్రయత్నానికి
ఇదే మంచి సమయం

12mar2020b

PRESSLINK

https://youtu.be/Guv_FDJb0mk

https://youtu.be/bu1qOFXLzec

https://youtu.be/S1qdpDwYspw

Song of Solomon 2: 13
The fig tree putteth forth her green figs, and the vines with the tender grape give a good smell. Arise, my love, my fair one, and come away. Amen!!

One thought on “R1

Leave a comment